ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రొద్దుటూరు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

📰 Generate e-Paper Clip

–మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి

సలాం   ప్రొద్దుటూరు:

ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి పాల్గొన్నారు.సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. సభా ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు.పర్యటన సందర్భంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సమావేశంలో సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి  ఎస్. సవిత, పురపాలక శాఖ మంత్రి  పి. నారాయణ, రోడ్లు–భవనాల శాఖ మంత్రి  బి.సి. జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్  శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్  నిధిమీనా, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే  రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్  రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్‌రెడ్డి తదితరులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!