ఇంటింటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమం – భగత్ సింగ్ కాలనీలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం
సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను ప్రజలకు వివరించే ఉద్దేశంతో స్థానిక భగత్ సింగ్ కాలనీలో సోమవారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. ఇంటింటికీ వెళ్లిన నాయకులు ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు...