ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఆరోగ్యంఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తతే పశువుల రక్షణకు మార్గం

ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తతే పశువుల రక్షణకు మార్గం

📰 Generate e-Paper Clip

–రాజుపాలెంలో రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం

–నీరు, నీడ, పశుగ్రాసం, గాలి ప్రసరణపై ప్రత్యేక సూచనలు

సలాం ప్రొద్దుటూరు –  రాజుపాలెం:

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి పశువులను రక్షించేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య నిపుణులు సూచించారు. పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో DRDA రాజుపాలెం సహకారంతో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38 మంది రైతులు పాల్గొన్నారు.కార్యక్రమానికి పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పశువుల ఆరోగ్యం, మేత తీసుకునే సామర్థ్యం, పాల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పశువులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు తగినంత నీడ, మంచి గాలి ప్రసరణ కల్పించాలని సూచించారు.అదేవిధంగా ఎండుగడ్డి, సైలేజ్ తదితర పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని రైతులకు సూచించారు. వేసవిలో పశువులపై వేడి ఒత్తిడి పెరగకుండా శాస్త్రీయ పశుపోషణ పద్ధతులను పాటించాలని తెలిపారు.DRDA రాజుపాలెం APM  సుజాత మాట్లాడుతూ రైతులు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ శాస్త్రీయ పశుపోషణ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

ఈ సందర్భంగా డా. డి. ఇందిర ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి సంరక్షణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. పశువుల్లో వేడి ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.అలాగే డా. చరిత, డా. గాయత్రి, డా. మంజుల, డా. జాన్, డా. వంశీ, డా. మాధవరెడ్డి,  రాజేష్ తదితరులు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, సమతుల్య పోషణ, శాస్త్రీయ పశుపోషణ పద్ధతులపై రైతులకు వివరించారు.పశువులకు స్వచ్ఛమైన నీరు, తగినంత నీడ, గాలి ప్రసరణ, సమతుల్య పోషణ అందించడంతో పాటు అవసరమైన పశుగ్రాసాన్ని ముందుగానే సమకూర్చుకోవాలని నిపుణులు సూచించారు. ఎల్‌నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నీరు–పశుగ్రాసం–పశువుల ఆరోగ్య నిర్వహణపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని రైతులకు సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!