ఆహార నియమాలతో గుండె జబ్బులు నివారణ
సలాం ప్రొద్దుటూరు: ఆహార నియమాలు పాటిస్తూ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చని కార్డియాలజిస్ట్ డాక్టర్ పాతకోట శ్రీనాథరెడ్డి తెలిపారు. నెహ్రూ రోడ్డులోని లక్ష్య హాస్పిటల్‌లో ఆదివారం ఉచిత గుండె, కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనాథరెడ్డి, డాక్టర్ హరిత మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ప్రతి నెల మూడో ఆదివారం ఉచిత గుండె, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 63 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పేదలు మధ్యతరగతి...