ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్నిబంధనలు పాటించని వైష్ణవి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

నిబంధనలు పాటించని వైష్ణవి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

 

-ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.

సలాం ప్రొద్దుటూరు (కడప):

పోరుమామిళ్ళ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైష్ణవి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్(ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు పిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

 

పోరుమామిళ్ళ మండల కేంద్రంలోని వైష్ణవి స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని, పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతూ పాఠశాలలోనే హాస్టల్ నిర్వహిస్తూ విద్యార్థుల నుండి వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పాఠశాలకు చెందిన స్కూల్ బస్ లలో విద్యార్థులను పరిమితికి మించి స్టాండింగ్ లో ఎక్కించుకొని అధిక వేగం తో వెళుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారు అన్నారు. పాఠశాల బస్ లు ప్రధాన రహదారుల్లో ఇష్టం వచ్చినట్లు రోడ్డుకు అడ్డంగా ఆపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు. ఇప్పటికైన అధికారులు విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైష్ణవి స్కూల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!