ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్వైద్య సేవ సమాజానికి అమూల్య సంపద

వైద్య సేవ సమాజానికి అమూల్య సంపద

📰 Generate e-Paper Clip

 

–ప్రజల కుటుంబాలకు అండగా వైద్యులు

–వృత్తితోపాటు ప్రేమ సేవల సమ్మేళనమే నిజమైన ఉద్యోగ ధర్మం

–రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి

–మంత్రి సమక్షంలో విశిష్ట సేవలు అందించిన వైద్యులకు ఘన సత్కారం

సలాం ప్రొద్దుటూరు:

 

దైవం ప్రాణం పోస్తే ఆపద సమయాలలో వైద్యులు ప్రాణాలు కాపాడి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని వైద్య సేవ సమాజానికి అమూల్య సంపదగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు మేయర్ గా ముఖ్యమంత్రిగా గవర్నర్ గా వివిధ పదవులను ఆదర్శనీయంగా చేపట్టి వైద్యరంగంలో విశేష సేవలతో పాటు మానవతా సేవా భావాన్ని చాటి భారతరత్న గా బిరుదు పొందిన డాక్టర్ డిసి రాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రొద్దుటూరు ఐఎంఏ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ కన్వర్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగాలలో అందిస్తున్న సౌకర్యాలు వసతులు సేవలు వివరించారు వృత్తి ధర్మంతో పాటు సేవే పరమావధిగా సమాజానికి మంచి చేయాలనే భావనతో ప్రేమ దయాగుణంతో వైద్యరంగంలో సేవలందించిన వైద్యులకు ఈ సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు రాయలసీమ జిల్లాల నుంచి ఎంపికైన సన్మాన గ్రహీత లో ఒకరైన ప్రొద్దుటూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ పున్న సువర్ణను మంత్రి సమక్షంలో ఘనంగా సత్కరించారు మంత్రి సత్య కుమార్ తో పాటు సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ల ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్ సమక్షంలో డాక్టర్ పద్మలత డాక్టర్ ప్రతిమదేశాయి డాక్టర్ సల్మా భాను లు సీనియర్ గైనకాలజిస్ట్ పున్న సువర్ణను శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో పుట్టి పెరిగిన డాక్టర్ సువర్ణ తండ్రి పూర్ణ శ్రీరాములు తామర పత్ర గ్రహీత స్వతంత్ర సమరయోధుడు తల్లి పుష్పలీల గృహిణి సువర్ణ హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో 1978 నుంచి 1984 వరకు ఎంబిబిఎస్ ను పూర్తి చేశారు నాలుగేళ్ల పాటు ప్రైవేట్ ప్రాక్టీస్ చేపట్టారు మంచిర్యాల మెడికల్ ఆఫీసర్ గా 1988 నుంచి 1992 వరకు విధులు నిర్వహించారు తదనంతరం ఐసిడిఎస్ మెడికల్ ఆఫీసర్ గా 1996 వరకు కొనసాగారు 1996 నుంచి 1998 వరకు గాంధీ మెడికల్ కాలేజీలో గైనిక్ విభాగంలో పీజీని పూర్తి చేశారు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో 100 పడకల ఏరియా ఆసుపత్రిలో రెండేళ్లపాటు విశేష సేవలు అందించారు తదనంతరం ప్రైవేట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టినప్పటికీ తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న సేవా తత్వాన్ని ఇప్పటివరకు ఆమె కొనసాగిస్తూ వచ్చారు పేదల పట్ల మమకారం రోగుల పట్ల ప్రేమ ఆమె హృదయంలో నిండుగా ఉన్నాయి తన ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి ఉచిత భోజన సదుపాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా అందిస్తూ వస్తున్నారు ప్రతి సందర్భంలోనూ సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ లాభాపేక్ష లేని సేవా భావాన్ని ఆమె ప్రజానీకానికి అందిస్తూ వచ్చారు లక్షలాదిమందికి ఇప్పటివరకు వైద్యసేవలందించారు డాక్టర్ పున్న సువర్ణ సేవలు ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐఎంఏ సభ్యులతో పాటు కడప నంద్యాల కర్నూలు నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన వైద్యులు వైద్యాధికారులు పెద్ద ఎత్తుల పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!