సలాం ప్రొద్దుటూరు:
బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ ఇస్లాంపురం వీధి లో ఉన్న డా. వి.ఎస్. ముక్తియార్ నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ ను శాలువాతో ఘనంగా ముక్తియార్ సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నాయకులు ఆత్మీయంగా చర్చించారు. అనంతరం మంత్రి సత్య కుమార్ ను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ మర్యాదపూర్వక భేటీలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
