ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్భారత్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాపార సముదాయ భవనానికి భూమిపూజ ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. వి.ఎస్. ముక్తియార్

భారత్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాపార సముదాయ భవనానికి భూమిపూజ ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. వి.ఎస్. ముక్తియార్

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ పక్కన నిర్మించనున్న భారత్ ఎంటర్‌ప్రైజెస్ గ్రానైట్, మార్బుల్ & టైల్స్ వ్యాపార సముదాయం భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా డా. ముక్తియార్ మాట్లాడుతూ, భారత్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు డా. ముక్తియార్‌ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!