ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప పార్లమెంట్ పరిధిలో 300కు పైగా దరఖాస్తులు

కడప పార్లమెంట్ పరిధిలో 300కు పైగా దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కడప):

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు  చిలకం మధుసూదన రెడ్డి  నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం ,3 వ రోజు కడపలోని హరిత హోటల్‌లో ప్రొద్దుటూరు, బద్వేల్ నియోజకవర్గాల పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు సేకరించారు. ఈ దరఖాస్తులను పార్టీ అధ్యక్షులు  దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పరిశీలకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ కడప పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు 300కు పైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అదేవిధంగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే అంకితభావం కలిగిన నాయకులు, కార్యకర్తలకు, వీర మహిళలకు సముచిత గుర్తింపు లభించేలా ఈ సమాచార సేకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!