ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప ఉక్కు పరిశ్రమకు పలుమార్లు శంఖుస్థాపనలు చేసి జిల్లా ప్రజానీకానీ మోసం

కడప ఉక్కు పరిశ్రమకు పలుమార్లు శంఖుస్థాపనలు చేసి జిల్లా ప్రజానీకానీ మోసం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

కడప ఉక్కు పరిశ్రమకు పలుమార్లు శంఖుస్థాపనలు చేసి జిల్లా ప్రజానీకానీకి  రాష్ట్ర ప్రభుత్వాల మోసం చేస్తున్నయని,నిర్ణీత కాలంలో కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చెయ్యాలనీ పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ డిమాండ్..  పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడారు.రాయలసీమ వాసులు, కడప జిల్లా ప్రజానికం చిరకాల ఆకాంక్ష కడప ఉక్కు పరిశ్రమను నిర్మాణం, ఈ ఆకాంక్షను పాలకవర్గాలు నెరవేర్చకుండా, పరిష్కరించకుండా కడప జిల్లా ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నాయని వారు మండిపడ్డారు, అధికారం మారినప్పుడల్లా  శంకుస్థాపనలు చేయడం ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా గాలికి వదిలేయడం షరా మాములయ్యిందని  అన్నారు. కరువు,వలసలు, నిరుద్యోగానికి, కేరాఫ్ అడ్రస్ గా మారిన రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధిని కల్పించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంత ప్రజానీకాన్ని, ఓట్లు సీట్ల కోసం మాత్రమే వాడుకుంటూ, వారి మనోభావాలపైన దెబ్బతీస్తూ పలు మారులు శంకుస్థాపనలు చేసి , పరిశ్రమ పూర్తి చేసే ప్రణాళిక కానీ, చిత్త శుద్ధి లేకుండా ఘోరంగా మోసం చేస్తూ, చంద్రబాబు నాయుడు 2018 లో శంకుస్థాపన చేసి శిలాఫలకానికే పరిమితం చేశారు, మరొక్కసారి శంకుస్థాపన అంటూ జిల్లా ప్రజానీకాన్ని మరొక్కసారి మోసం, దగా చెయ్యకుండా ప్రణాళిక ప్రకారం సకాలంలో చిత్తశుద్ధి తో కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు,పిఆర్ఎస్ వైఎఫ్ నగర నాయకులు వెంకటప్రసాద్, సతీష్ పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!