సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ బాధ్యతలను అధికారికంగా స్వీకరించిన అధ్యక్షుడు రోటేరియన్ కొవ్వూరు రమేష్ రెడ్డి , కార్యదర్శి రోటేరియన్ గాండ్లూరు శ్రీధర్ శర్మ కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు బేపారి జాకిర్ అహ్మద్ కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు . “స్వార్థానికి అతీతంగా సేవ” అనే గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పదవీకాలం అత్యంత విజయవంతంగా ,ప్రభావవంతంగా సాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
