సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు బేపారీ జాకిర్ ఆధ్వర్యంలో ఎన్యుమరేషన్ ఫారాలు ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని జోక్ పాలెం వీధి లో ప్రతి ఒక్కరీ కి కలిసి ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ECI) 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను నెల రోజుల పాటు నిర్వహిస్తోందనీ ఆయన అన్నారు. ఓటర్ల జాబితాలను నవీకరించడానికి మరియు లోపాలను సరిదిద్దడానికి, ఇంటింటికీ వెళ్లి చేసే ఈ భారీ గణన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి బూత్ నంబర్ 161 లోని ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను అందించారు.
