సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ లో కొంతమంది దొంగ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట కొనిరెడ్డి ఆధ్వర్యంలో అమృత్ నగర్ బాధితుల తో కలిసి తహసిల్దార్ కు అక్కడ జరుగుతున్న దొంగ పట్టాల ముఠా గురించి వివరించారు. పేదల భూములు ₹5 లక్షల వరకు వారికే తెలియకుండా ఇతరులకు అమ్ముతున్నారని వివరించారు. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
