సలాం ప్రొద్దుటూరు(మదనపల్లి ):
ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరు కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీర భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గం కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ప్రకారం చేనేతలకు ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి 25 వేల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు బడ్జెట్ పెంచాలని, చేనేతకు ప్రత్యేకమైన శాఖ మరియు మంత్రి ఏర్పాటు చేయాలని, చేనేతకు ఉపాధి కల్పించే నూతన పనిముట్లు ఇవ్వాలని, బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉమ్మడి ముఖ్యమంత్రి కె కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు సిల్క్ సబ్సిడీ రూ. 2000 ఇచ్చారని, అదేవిధంగా సిల్క్ రాయితీ పాసుపుస్తకాలు పెండింగ్లో ఉన్న బిల్లులను అమలు చేయాలి, సబ్సిడీ ఇచ్చి ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది పడుతున్న చేనేతలను ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చేనేత కార్మికులు నేతన్నలు పట్లా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా చేనేత కార్మికులకు 25000/- రూపాయలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని న్యాయమైన డిమాండ్ల తో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు మరియు మెమొరాండాలు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకంతో పాటు, సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించి ఆదుకోవాలని, రైతులకు మరియు మామిడిపంట రైతులకు ప్రభుత్వం ఆదుకునే విధంగా చేనేతలను సంక్షేపధకాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాదినేని రమేష్ నాయుడు, గాలివీడు మండలం కన్వీనర్ శిబ్యాల వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్ జాన్, సలీం . శివ. సుధాకర్ , రమేష్, గుంపు వెంకటేష్, చిన్న కోట్ల రామకృష్ణ , అనంత ఈశ్వరయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
