సలాం ప్రొద్దుటూరు (గుంటూరు) :
ప్రముఖ నటుడు కృష్ణ సీనియర్ అభిమాని గుమ్మడి రవికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన వీరనారాయణ కి మే నెల సహాయము కింద 10116 రూపాయలు కృష్ణ సీనియర్ అభిమానులు గుంటూరుకు చెందిన చిష్టీ, సురభి యేసు, రాజేంద్ర, శ్రీను, టి వెంకటరమణ, ప్రొద్దుటూరు మహమ్మద్ రఫీ ఎడిటర్, మరియు కడప కు చెందిన పుచ్చగింజల హరికృష్ణ సమక్షంలో గుంటూరు నారాయణ కి నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ నెల కృష్ణ అభిమానుల ద్వారా పోగుచేసిన డబ్బులను అభిమానులకు అందజేయడం జరుగుతుంది అని ఇందులో భాగంగా మే నెలకు సంబంధించి నారాయణ కు అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ తన తోటి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
