ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్జూన్ 16 న గండికోట లో ప్రత్యేక యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

జూన్ 16 న గండికోట లో ప్రత్యేక యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

📰 Generate e-Paper Clip

 

 

జూన్ 16 న పర్యాటక కేంద్రం అయిన గండి కోట లో ఉ.6 గం.ల నుండి ఉ.7 గం.ల వరకు “ప్రత్యేక యోగా ప్రదర్శన”

–ప్రత్యేక యోగ ప్రదర్శన” కార్య క్రమం లో కుటుంబ సభ్యులందరి తో కలిసి ఉత్సాహం

–జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవము లో అందరూ భాగ స్వామ్యులు కావాలి

–యోగా తో సంపూర్ణ ఆరోగ్యం

–yogandhra.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకోండి…

సలాం ప్రొద్దుటూరు:

 

యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మానసిక ఉల్లాసం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర క్యాంపెయిన్-2026’ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

నేటి వేగవంతమైన జీవనశైలి లో ఒత్తిడి,ఆందోళన, మధుమేహం,రక్తపోటు వంటి సమస్యలకు “యోగా” ఒక దివ్య ఔషధంగా.. సమర్థవంతమైన పరిష్కారాన్నిస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జూన్ 16 – గండికోట లో ప్రత్యేక యోగా ప్రదర్శన…ప్రత్యేక యోగ ప్రదర్శన కార్యక్రమం ఉ.6 గం. ల నుండి ఉ.7 గం.ల వరకు జరిగే కార్యక్రమం లో ప్రతి కుటుంబం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహం గా యోగా కార్యక్రమం లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

జూన్ 21 – రాజా రెడ్డి స్టేడియంలో 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుక జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా యోగా గొప్పతనాన్ని ప్రజలకు చేర వేయడంతో పాటు, ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవాటు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.జిల్లా లో యోగాంధ్ర కార్యక్రమాల సమర్థ నిర్వహణ కోసం..జిల్లా, మండల, గ్రామ/వార్డు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 26 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటైందన్నారు.

యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని..

యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదని.. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే భారతీయ ఋషుల ఆరోగ్య జ్ఞానం నుండి ఉద్భవించిన అమూల్య సంపద అన్నారు. యోగా మన దిన చర్యలో భాగం అయితే.. కలిగే లాభాలను కూడా ఆయన తెలిపారు.yogandhra.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకోండి…

యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ yogandhra.ap.gov.in పోర్టల్ లోనమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ యోగాభ్యాసం వైపు మళ్లించాలనికూడా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

 

యోగ ద్వారా మానసిక ఉల్లాసం పొందేందుకు మన దిన చర్య లో “యోగా” ఒక భాగం కావాలి*

 

యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా.. ప్రతి కుటుంబం దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ ద్వారా జిల్లాలో లక్షలాది మందికి యోగా చేరువై, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి ఇంట్లో యోగా.. ప్రతి మనిషికి ఆరోగ్యం” అనే లక్ష్యంతో యోగాంధ్ర క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!