ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ కు వినతిపత్రం–సీఐటీయు

ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ కు వినతిపత్రం–సీఐటీయు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీవారికి ఐదు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ కు సోమవారం వినతిపత్రం ను  సిఐటియు ఇచ్చారు  .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలలో పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని డిఆర్ఓ మల్లి ఖార్జునుడు కు సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిఐటియు జిల్లా కోశాధికారి పి.వెంకటసుబ్బయ్య లు అందించారు.కడప జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలను నడుస్తున్నాయని తెలిపారు. ఇందులో సెక్యూరిటీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా సేవా సుప్రీం ఏజెన్సీ పరిధిలో సెక్యూరిటీ గార్డ్స్ నడుస్తున్నదని తెలిపారు. ఇందులో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు దాదాపు గత ఐదు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే తరుణంలో శానిటేషన్ కార్మికుల పరిస్థితి అదే పరిస్థితి ఉన్నదని తెలిపారు. వేతనాలు ఇవ్వని సేవ సుప్రీమ్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. కనుక తక్షణం పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని VC వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!