ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్హౌసింగ్ అక్రమాలపై ఉక్కుపాదం .. మంత్రి

హౌసింగ్ అక్రమాలపై ఉక్కుపాదం .. మంత్రి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

–హౌసింగ్ శాఖ సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి పార్థసారథి సీరియస్ వార్నింగ్..!*

–సెప్టెంబర్ నాటికి పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి*

–ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీకృష్ణాలయం దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పార్థసారధి  ,ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు చిన్నశెట్టిపల్లె వెళ్లే దారిలో ఉన్న బొల్లవరం లే అవుట్ “జగనన్న కాలనీ” ని సందర్శించిన మంత్రి కొలుసు పార్థసారధి ,ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,యువనాయకులు నంద్యాల కొండారెడ్డి .

ఇల్లు కట్టిస్తామని అదనంగా మా దగ్గర 35 వేలు,మరికొందరి దగ్గర లక్ష రూపాయలు అలా తీసుకున్నారని ప్రభుత్వము నుండి వచ్చే డబ్బులు మా అకౌంట్లో పడి ఉంటే అవి కూడా మమ్మల్ని వారే బ్యాంకు వద్దకు తీసుకొని వెళ్లి డ్రా చేసుకుని కాంట్రాక్టర్లు తీసుకున్నారని కానీ మాకు ఎక్కడ ఇల్లు కట్టివ్వలేదని దయచేసి మాకు న్యాయం చేయాలని మంత్రి గారికి విన్నవించుకున్న “జగనన్న కాలనీ” బాధితులు.

జగనన్న ఇళ్ల పేరుతో కోట్ల దోపిడీ జరిగిందని,అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి పేదలకు న్యాయం చేస్తామని,కాంట్రాక్టర్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలని,స్వాహా చేసిన కోట్ల రూపాయలను తిరిగి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పార్థసారధి. గతంలో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు,ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. బాధ్యులపై శాఖాపరమైన,చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

R&B గెస్ట్ హౌస్ నందు అధికారుల సమావేశం

హౌసింగ్ లేఔట్ లో పురోగతి,పెండింగ్ పనులు,లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి,గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ గారు,నంద్యాల ఆనంద్ భార్గవ్ రెడ్డి గారు,నంద్యాల హరినాథ్ రెడ్డి గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర రెడ్డి గారు,జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి గారు,K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి గారు,TDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబీవుల్లా గారు,TDP కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు గారు,TDP కడప పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య గారు,శివాలయం చైర్మన్ వంగల నారాయణరెడ్డి గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,లింగాపురం AGR బ్యాంకు చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,బేపారి గౌస్ భాష,TDP పట్టణ ఉపాధ్యక్షులు ఖలీల్ భాష,బచ్చల ప్రతాప్,రసూల్ గౌస్,ఆరీఫ్,మున్నా,బూతురు వెంకట్రామిరెడ్డి,GC పుల్లయ్య,గంజికుంట ఆంజనేయులు,గాలిపోతుల సుదర్శన్,చౌడూరు రవి,హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!