ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్హౌసింగ్ నిర్మాణాల్లో అవినీతి కి పాల్పడిన వారిని కేసు నమోదు చేస్తాం–మంత్రి

హౌసింగ్ నిర్మాణాల్లో అవినీతి కి పాల్పడిన వారిని కేసు నమోదు చేస్తాం–మంత్రి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

హౌసింగ్ నిర్మాణాల్లో అవినీతి కి పాల్పడిన వారి పై కేసు నమోదు చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి పోలీసులు ఆదేశించారు. శనివారం రాష్ట్ర హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రొద్దుటూరు కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హౌసింగ్ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేసింది అన్నారు.హౌసింగ్ నిర్మాణాలల్లో ఎవరెవరు మోసం చేశారో వారిపైన కేసులు నమోదు చేస్తారన్నారు.జగనన్న కాలినీలలో జరిగిన నిర్మాణాల విషయంలో లబ్ధిదారులకు న్యాయం  చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ప్రొద్దుటూరులో హౌసింగ్ కాంట్రాక్టర్లకు 10 కోట్లు ఇవ్వగా మిగిలిన 35 కోట్లు కమిషనర్ దగ్గరే ఉన్నాయని స్పష్టం చేశారు.జగనన్న కాలినీలలోని ఇల్లులు పూర్తి చేస్తే ఇక్కడికి వచ్చి నివసిస్తారా ?  అని లబ్ధిదారులతో మంత్రి పార్థసారధి మాట్లాడారు.గత ప్రభుత్వం నిలిపివేసిన హౌసింగ్ నిర్మాణాలను కూటమి ప్రభుత్వం నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు.జగనన్న కాలినీల కాంట్రాక్టర్లు, సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడి ఉంటే ఎంక్వయిరీ చేస్తామన్నారు. ఆలాగే కచ్చితంగా అవినీతికి పాల్పడితే అధికారులు కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు రికవరీ చేయిస్తాం అని అన్నారు. మంత్రి తో పాటు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి, టిడిపి నేతలు నంద్యాల కొండారెడ్డి, తదితరలు ఉన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!