సలాం ప్రొద్దుటూరు :
కరోనా సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నేతన్న నేస్తం పథకం వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందని జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, పట్టణ చేనేత విభాగం అధ్యక్షుడు రాగా నరసింహారావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన ర్యాలీలో జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, పట్టణ చేనేత విభాగం అధ్యక్షుడు రాగా నరసింహారావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేతన్న నేస్తం పథకం కొనసాగింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి నియామకాలు జరగకపోవడం వల్ల వెనుకబడిన వర్గాల అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.చేనేతల అభ్యున్నతికి కృషి చేసిన ప్రభుత్వాలకు మాత్రమే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన నాయకులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేనేత వర్గాలు తమ ఓటు ద్వారా ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్పాలని కోరారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చేనేత విభాగానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
