–ధర్మవరం ఇంచార్జ్ సీడీపీఓ శైలజ*
సలాం ప్రొద్దుటూరు (ధర్మవరం):
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అర్బన్, రూరల్ పరిధిలో 21 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీ ఏర్పడినట్లు ఆ శాఖ ధర్మవరం ఇంచార్జ్ సీడీపీఓ శైలజ సోమవారం తెలిపారు. అర్బన్ పరిధిలో 10, రూరల్ పరిధిలో 11 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నట్లు వివరించారు. పదో తరగతి చదివి, ఖాళీ ఉన్న ప్రాంత కోడలై ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు తరువాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులను ధర్మవర్మలోని సీడీపీఓ కార్యాలయంలో అందజేసి, రసీదు పొందాలని ఇంచార్జ్ సీడీపీఓ శైలజ సూచించారు.
