సలాం ప్రొద్దుటూరు (పెనుకొండ):
విజయవాడ నగరంలో త్వరలోనే రాష్ట్ర స్థాయి భారీ సూఫీ కాన్ఫరెన్స్ బహిరంగ మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సూఫీ మత పెద్దలు ప్రకటించారు. శనివారం
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహ్మతుల్లాహి అలైహి దర్గా షరీఫ్‌లో రాష్ట్రంలోని ప్రముఖ సూఫీ మత పెద్దలు, సజ్జాదా నషీన్‌లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సూఫీ తాజ్ బాబా ఆధ్వర్యంలో మషాయిఖ్‌లు, పీఠాధిపతులు, ముతవల్లీలు మరియు మురీదుల ఉన్నత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ మహాసభ నిర్వహణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
5,000 మంది ఫకీర్లతో విజయవాడలో భారీ ‘రాష్ట్ర స్థాయి సూఫీ కాన్ఫరెన్స్ బహిరంగ మహాసభ నిర్వహిస్తున్నట్లు పెనుగొండ దర్గాలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ఇరాన్, ఇరాక్ దేశాల నుండి రానున్న ప్రముఖ అంతర్జాతీయ సూఫీ మత గురువులు
అమరావతి హాజరవుతారు అన్నారు.
అంతర్జాతీయ ప్రతినిధుల ఈ మహాసభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తూ, విదేశాలైన ఇరాన్ మరియు ఇరాక్ దేశాల నుండి ప్రముఖ సూఫీ మత గురువులు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక వేత్తలు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 5,000 మంది ఫకీర్లు, జలాలీ ఫుఖ్రాలు, రిఫాయీలు, ముర్షిద్‌లు, బాన్వాలు, ఖలందరీలు ఈ మహాసభకు వస్తారన్నారు.
ఈ మహాసభ ముఖ్య లక్ష్యం సూఫీ సంప్రదాయాల పరిరక్షణ, మానవతా విలువల ప్రచారం, సర్వమత (మత సామరస్యం) మరియు ఆధ్యాత్మిక చైతన్య విస్తరణే ధ్యేయంగా ఈ మహాసభ ప్రసంగాలు ఉంటాయి అన్నారు.
సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మహాసభ విజయవంతం కోసం త్వరలోనే రాష్ట్ర కార్యవర్గాన్ని, అనంతరం జిల్లా స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దర్గాల గురువులు, సజ్జాదా నషీన్‌లు మరియు మత పెద్దలతో సంప్రదింపులు జరిపి పూర్తి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
పెనుగొండ దర్గాలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి జాంపని అతా ముహమ్మద్ నిజాముద్దీన్ షా తాజ్ ఖాదరీ (హజరత్ తాజ్ బాబా) గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షులు కె.ఎం. షకీల్ షఫీ , ప్రధాన కార్యదర్శి ఉబేదుల్లా సాహెబ్ , తెనాలి ప్రాంత సూఫీ పెద్దలు మరియు రాష్ట్రంలోని వివిధ దర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
