ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు..

24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు..

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి బీడర్స్ మిల్లులో జరిగిన చోరీ కేసుకు సంబందించి టూ టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏఎన్సీ విభూ కృష్ణ గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మిల్లులో ఆపరేటర్ పనిచేస్తున్న కిరణ్కు వ్యాపార వేత్తలు గదిలో భారీ మొత్తంలో నగదు భద్రపడుస్తారనే విషయం తెలిసి, తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనానికి పదకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 30న అర్ధరాత్రి సమయంలో మిల్లులోకి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరా వైర్ ను కత్తిరిం చాడు. గది లోపలికి ప్రవేశించి, ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న డబ్బు బ్యాగ్ను అపహరించాడు .ఈ సమయంలో ఉత్తయ్య అతనికి సహకరిస్తూ కాపలా కాశారు .అనంతరం నేరాన్ని గుర్తించకుండా ఉండేందుకు గదిలో ,బీరువాలో నగదు సంచిలో కారంపొడి చల్లినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.11.36 లక్షలు నగదు. నేరానికి ఉపయోగించిన ఇనుప సుత్తె ,ఆకుపచ్చ రంగు గుడ్డ బ్యాగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఏఎస్సీ విభూకృష్ణ తెలిపారు. ఈ కేసును అత్యంత తర్వగా ఛేదించి, దోరీ సొత్తును రికవరీ చేసిన టూటౌన్ సీఐ వంశీనాథ్, సిబ్బందిని, అదనపు పోలీసులను ఎఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!