ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు ):

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జమ్మలమడుగు దళిత సంఘాల నాయకులు, క్రైస్తవ సోదరులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో దళిత సంఘాలు మరియు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దళిత క్రైస్తవులపై దాడులు హత్యలు ,అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు దళిత క్రైస్తవులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాలాజీ చిన్న వెంకటస్వామి, రామాజీ ఇమ్మానియేలు,అవిశ శ్రీనివాసులు, కిరణ్, బిర్రు చెన్నయ్య ,వినయ్ ,మేకల ఆంజనేయులు, ప్రసాదు, గడ్డం ఓబులేసు, పట్నం ఆల్ఫ్రెడ్,గోనా ఆశీర్వాదం పొన్న తోట జయచంద్ర,, ప్రొద్దుటూరు జయచంద్ర,పాస్టర్లు బత్తుల ప్రవీణ్, డేవిడ్, చింతకొండ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!