ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్నేడు సైకిల్ డే ...

నేడు సైకిల్ డే …

📰 Generate e-Paper Clip

 

ఎప్పటి నేను..

నీ చిన్ననాటి నేస్తాన్ని..

జీవితకాలపు వాహనాన్ని..

పేరులో కిల్ ఉన్నా

చంపని బండిని..

నాతో ఖర్చు లేని పని..

ఉండల్లో కాస్త గాలి నింపితే

ఎంత ఎండల్లోనైనా

నిన్ను తిప్పేస్తా..

నేను తిరిగేస్తా గాని

నిన్ను తిరగెయ్యనోయి…!

నా పేరు సామాన్యుడి బండి

నువ్వు పల్సర్ కొన్నాక

నేను ఇంట్లోనే బందీ..

మోటారు బండికి రోజుకో కొత్త నగిషీ..

నన్ను తోలితేనేమో

నీకు నామోషీ..

చులకన చేస్తుందని నీ ‘షీ’..!

 

అన్నట్టు..ఒక్క ఇసయం

యాదుంచుకో…

నన్ను నడపడం ఒస్తేనే

ఆనక స్కూటరైనా..

మోటార్ సైకిలైనా..కారైనా..

అట్టనే..నన్ను కొన్నాకనే

పెద్ద బళ్లకు నీ ప్రమోషన్..

నీ జీవితపు ఎదుగుదలకు

నేనే తొలిమెట్టు..

మర్చిపోవడం నీ గుణం..

మూలపడేసినా వీడిపోదు

నా రుణం!

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!