నేడు సైకిల్ డే …
ఎప్పటి నేను.. నీ చిన్ననాటి నేస్తాన్ని.. జీవితకాలపు వాహనాన్ని.. పేరులో కిల్ ఉన్నా చంపని బండిని.. నాతో ఖర్చు లేని పని.. ఉండల్లో కాస్త గాలి నింపితే ఎంత ఎండల్లోనైనా నిన్ను తిప్పేస్తా.. నేను తిరిగేస్తా గాని నిన్ను తిరగెయ్యనోయి...! నా పేరు సామాన్యుడి బండి నువ్వు పల్సర్ కొన్నాక నేను ఇంట్లోనే బందీ.. మోటారు బండికి రోజుకో కొత్త నగిషీ.. నన్ను తోలితేనేమో నీకు నామోషీ.. చులకన చేస్తుందని నీ 'షీ'..! అన్నట్టు..ఒక్క ఇసయం యాదుంచుకో... నన్ను నడపడం ఒస్తేనే...