కడప జిల్లా ఆర్య వైశ్య సంఘం (రూరల్) అధ్యక్షులుగా బద్వేల్ పట్టణానికి చెందిన వల్లంకొండు వెంకటరమణ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డైరెక్టర్ కె.వి. సుబ్బారావు, సీనియర్ అడ్వకేట్ మాజీ జిల్లా సంఘం అధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్ ల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ సమక్షంలో, మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం (రూరల్) అధ్యక్షుడిగా వల్లంకొండు వెంకటరమణ పేరును అధికారికంగా ప్రకటించారు.
హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు :
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య , రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, టీజీ వెంకటేష్ కు పూల బొకేలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు, తెలియజేశారు. వెంకటరమణ గారి నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణం నుండి తుమ్మలపెంట సురేష్ బాబు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, తులసి వెంకట శివ నారాయణ, విద్యావేత్త సి.వి. నాగేశ్వరరావు, అడ్వకేట్ పత్తి నాగేంద్రప్రసాద్, జొన్నలగడ్డ సుధాకర్.అలాగే మైదుకూరు నుంచి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిశెట్టి ప్రసాద్, మైదుకూరు ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు దొంతు వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
