ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్అత్యవసర సమయంలో ముగ్గురు రక్తదాతల స్పందన

అత్యవసర సమయంలో ముగ్గురు రక్తదాతల స్పందన

📰 Generate e-Paper Clip

 

– ప్రసూతి బాధితురాలితో పాటు మరో రోగికి ప్రాణాధారమైన రక్తదానం

సలాం ప్రొద్దుటూరు (కడప):

కడప నగరంలోని శ్రీ లక్ష్మీ ఆసుపత్రిలో ప్రసూతి చికిత్స పొందుతున్న రిజ్వానాకు అత్యవసరంగా B+ రక్తం అవసరమవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎం. తారిక్ అలీను సంప్రదించారు. అదే సమయంలో శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమతుల్లాకు కూడా అత్యవసరంగా రక్తదాతలు అవసరమయ్యారు.

ఈ సమాచారం అందుకున్న తారిక్ అలీ ట్రస్ట్ రక్తదాతల గ్రూపులో సందేశం పంపగా, కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ ఘౌస్ పీర్, షేక్ అలీ, పఠాన్ అజ్మతుల్లా ఖాన్ వెంటనే స్పందించి బృహదా బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా సయ్యద్ ఘౌస్ పీర్ అత్యవసర పరిస్థితిలో 11వ సారి B+ రక్తదానం చేసి తన సేవా భావాన్ని మరోసారి చాటుకున్నారు.

అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేసిన ముగ్గురు రక్తదాతలకు, అలాగే సమన్వయం చేసి సహాయం అందించిన ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్కు రోగుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సందర్భంగా సయ్యద్ ఘౌస్ పీర్ మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా కడప జిల్లాలో నిరంతరాయంగా రక్తదాన సేవలను అందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న ఎం. తారిక్ అలీ సేవలను అభినందించారు.

అదేవిధంగా ఎం. తారిక్ అలీ మాట్లాడుతూ, అత్యవసర సమయంలో మానవత్వంతో వెంటనే స్పందించి రక్తదానం చేసిన సయ్యద్ ఘౌస్ పీర్, షేక్ అలీ, పఠాన్ అజ్మతుల్లా ఖాన్లను ప్రత్యేకంగా అభినందించి, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరెందరో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ ఘౌస్ పీర్, షేక్ అలీ, పఠాన్ అజ్మతుల్లా ఖాన్, ఖాలిద్, నాగార్జున, హాజీ వల్లి, రోగుల కుటుంబ సభ్యులు, అలాగే బృహదా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు నాగార్జున, హర్ష పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!