ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్జనసేనలో పదవుల కోసం జూలై 1న బయోడేటా స్వీకరణ

జనసేనలో పదవుల కోసం జూలై 1న బయోడేటా స్వీకరణ

📰 Generate e-Paper Clip

 

 

–పార్టీ కోసం చేసిన సేవల ఆధారంగానే అవకాశాలు మాదాసు మురళీ

 

సలాం ప్రొద్దుటూరు:

జనసేన పార్టీ అధినేత పవన్  అశయాలకు అనుగుణంగా పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో బాధ్యతలు అప్పగించే ప్రక్రియ చేపట్టినట్లు జనసేన కడప పార్లమెంటు నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు మాదాసు మురళీ తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులోని నందిని క్లాత్ మార్కెట్‌లో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా కేంద్రం కడపలోని హరిత హోటల్‌లో జూలై 1 బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పార్టీ పదవులపై ఆసక్తి ఉన్న ఔత్సాహికుల నుంచి బయోడేటాలను స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ బాధ్యతల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.పార్టీలో ఎవరి సిఫారసులతోనూ పదవులు రావని, పార్టీ అధినేత తీసుకునే నిర్ణయమే అంతిమమని మాదాసు మురళీ స్పష్టం చేశారు. తాము కేవలం ఔత్సాహికుల వివరాలను పార్టీ అధిష్ఠానానికి అందించే బాధ్యతను మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు.గత 13 సంవత్సరాలుగా పార్టీ కోసం చేసిన సేవలు, కార్యక్రమాల వివరాలు, సంబంధిత ఫోటోలు, ఇతర ఆధారాలతో పాటు బయోడేటాను సమర్పించాలని ఆయన కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు లభించేలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలో జనసైనికులు అల్లం చంద్రశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!