సలాం ప్రొద్దుటూరు:
స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మంగళవారం జిల్లా ఆస్పత్రిలో కార్మిక సంఘ నాయకులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు మద్దతుగా అండగా నిలిచారు. వారు చేపట్టే నిరసన కార్యక్రమానికి సోమవారమే తన మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న అధికారులు ,కాంట్రాక్టర్ ఉదయం 10 గంటల వరకు మూడు నెలల జీతాలు కార్మికుల అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి జమ చేశారు. దీంతో కార్మికుల జీతాల సమస్య పరిష్కారమైంది. అయితే కేవలం
నెలకు 11,900 చొప్పున 3 నెలలకు సంబంధించిన జీతాలు కాంట్రాక్టర్ తమ అకౌంట్ లో జమ చేశారని కార్మికులు ఎమ్మెల్యే కు వివరించారు.కానీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి తమకు ప్రతి నెల 13,960 రూపాయలు జీతం రావాలని కార్మికులకు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యేకు కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమ్మె విరమించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు తెలిపారు.
3 నెలల జీతాలు తమ ఖాతాలలో జమ అయినందున ఎమ్మెల్యే మాట మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి ,డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ,ఆసుపత్రి సూపరిడెంట్ ఆనంద్ బాబు ,RMO రూపానంద్ ,డాక్టర్ గోపాల్ ,నాయకులు TDP కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు,పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య,మున్నా,బేపారి గౌస్ బాషా,నూరి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్,రిటైర్డ్ S.I శంకర్ ,తలారి రమేష్,గాలిపోతుల సుదర్శన్,సుబ్బారెడ్డి,శ్రీను,బాబు,కమాల్ బాషా,చౌడూరు రవి,మోడంపల్లె రవి,చెన్నారెడ్డి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
