ఎమ్మెల్యే చొరవతో శానిటేషన్ కార్మికులకు జీతాలు
సలాం ప్రొద్దుటూరు: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మంగళవారం జిల్లా ఆస్పత్రిలో కార్మిక సంఘ నాయకులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు మద్దతుగా అండగా నిలిచారు. వారు చేపట్టే నిరసన కార్యక్రమానికి సోమవారమే తన మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న అధికారులు ,కాంట్రాక్టర్ ఉదయం 10 గంటల వరకు...