ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeజాతియంవిద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన ప్రధాని మోదీ రాజీనామా చేయాలి 

విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన ప్రధాని మోదీ రాజీనామా చేయాలి 

📰 Generate e-Paper Clip

–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

దేశ విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టించి న ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గత రెండు రోజుల నుంచి కాక్రోచ్ జనత పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేస్తున్న నిరసనపై కక్షగట్టి పోలీసులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. కడపలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ తో పాటుగా అన్ని స్థాయిలోని నీటి నుంచి పీజీ వరకు ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో లీకులు కావడం పట్ల ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు, యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేస్తున్నారన్నారు. సోమవారం పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించ తలపెట్టిన విద్యార్థులు, యువతపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కక్షగట్టి పోలీసులతో అమానుషంగా దాడి చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా వారిపై అక్రమ కేసులు కూడా నమోదు చేశారన్నారు. నియంతలా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ కరుడుగట్టిన పాలకుడిగా హోం మంత్రి అమిత్ షా అమాయకులైన యువతపై దమనకాండ కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ముందుగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున కరిగే డిమాండ్ చేశా రన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టించి న ప్రధాని నరేంద్ర మోడీ అమాయకులైన యువతపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం, భాష్ప వాయువు ప్రయోగించడం, రక్త మోడే విధంగా బూట్లతో తొక్కించడం, వారిని వెంబడించి తరిమికొట్టి కక్షగట్టిన విధంగా ఢిల్లీ పోలీసులు దాడులకు తెగపడటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద న్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన యువత, విద్యార్థులు గత్యంతరం లేక మత విద్వేష పాలకుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతులలో పోరాటం చేస్తున్నారన్నారు. కానీ దీన్ని భరించలేని మత విద్వేష పాలకులు నరేంద్ర మోడీ, అమిత్ షా విద్యార్థులు, యువతపై ఉక్కు పాదం మోపడానికి పూర్తిస్థాయిలో పోలీసులు, సీఆర్పీ బలగాల క్రూరమైన పద్ధతిలో అవలంబించి వారిపై దమనకాండ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ మూకలకు పోలీసులు దుస్తులు ఇచ్చి తమపై దాడికి పురమాయించడం దారుణ మనీ యువత ఆరోపిస్తున్నారు అన్నారు. ఢిల్లీ పోలీసుల స్వయంగా రోడ్ల మధ్యలో ట్రక్కులతో రాళ్లను నింపిన వాహనాలు నిలపడం దారుణమన్నారు. సోమవారం నాడు పోలీసులను ఎదుర్కొంటూ, అవసరమైతే తమను కాల్చమంటూ దేశ యువత ముందుకు వెళ్లడం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థులు యువతకు జడిసిన మోడీ లోక్సభ వెనుక వైపు ద్వారం నుంచి పారిపోయాడన్నారు. దేశ యువత స్వయంగా మోడీని గద్దె దింపడానికి నిర్ణయించుకున్నారన్నారు. మోడీ ప్రభుత్వం విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ల పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!