సలాం ప్రొద్దుటూరు (విజయవాడ):
అమ్మా అని పిలిస్తే,
నేనున్నా అని పలికే చల్లని తల్లి
మన కడప శ్రీ విజయ దుర్గా దేవి
ఆ తల్లి సన్నిధిలో మంగళవారం రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించారు,మంగళ వారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి కి వేకువ జామున పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారి ని చక్కగ అలంకరించి దర్శనాన్ని అందించారు ఆలయ అర్చకులు. అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4.30 వరకు రాహు కాల పూజ నిర్వహించారు. గ్రహాలు ఆది పరాశక్తి శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి కాబట్టి అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు నిర్వహించడం వలన అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ,అందుకు నిదర్శనంగ ఆ విజయదుర్గా అమ్మవారు కూడా భక్తుల కోరికలను వెను వెంటనే నిరవేరుస్తున్నది కాబట్టి ఈ పూజకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుo టు ఆనందంగా ఉంటున్నారు.
అలాగే ఈ నెల 14 వ తేదీన శ్రీ విజయదుర్గామల్లికార్జునుల శాంతి కళ్యాణం వైభవంగా జరగనుంది ,
ఈ నెల(జూన్ )16 వ తేదీ జేష్టశుద్ధ విదియ నుండి జూలై 29 వ తేదీ ఆషాఢ పౌర్ణమి వరకు ఆలయంలో విజయదుర్గా దేవి మండలదీక్ష (మాలధారణ) నిర్వహిస్తారు
అని అందరూ పాల్గొని ఆ విజయ దుర్గా దేవి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మల్లికార్జున రావు గారు ,నిర్వాహకులు దుర్గా ప్రసాద్ గారు తెలియచేశారు
