ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి.. గాయాలైన వారికి ₹50 లక్షలు ఇవ్వాలి–రాచమల్లు డిమాండ్

మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి.. గాయాలైన వారికి ₹50 లక్షలు ఇవ్వాలి–రాచమల్లు డిమాండ్

📰 Generate e-Paper Clip

 

–మరమ్మత్తుల కు నోచుకొని,కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయడంతోనే ప్రమాదం

–కార్మికులు ఉక్కు ద్రావంలో భస్మమైతే కేవలం ₹25 లక్షల ప్రకటిస్తారా?

–వైసిపి హయాంలో మృతి చెందిన వారికి ₹1 కోటి రూపాయలు వైయస్ జగన్ తర్వాత రోజు ఇచ్చేశారు

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

 

విశాఖ లో జరిగిన ఉక్కు ప్రమాదం ఘటన అందరి మన మనస్సుల ను కలిచి వేసింది . ఎనిమిది మంది పనిచేస్తున్న కార్మికులు ఉక్కు ద్రావంలో భస్మమయ్యారు. మరమ్మత్తుల కు నోచుకోని , కాలం చెల్లిన యంత్రాలతో పనిచేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇంత ప్రమాదం జరిగిన కనీసం ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు వైపు కన్నెత్తి చూడకుండా విజయవాడలో రాజకీయాలు చేసుకుంటున్నారు. కార్మికులు ఉక్కు ద్రావంలో భస్మమైతే కేవలం ₹25 లక్షల ప్రకటిస్తారా? మృతి చెందిన వారికి ₹ 1 కోటి రూపాయలు గాయాలైన వారికి ₹50 లక్షల రూపాయలు ప్రభుత్వం వారి కుటుంబాలకు ఇవ్వాలని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం దొరసానిపల్లిలోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పరిస్థితి అద్వానంగా తయారైంది అన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు లేని కబోదియని, చెవుడని, హృదయం లేదని, రాక్షసమైన ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు. మృతిచెందిన కుటుంబాలకు వైయస్సార్ పార్టీ నాయకులు ఉంటామన్నారు. 175 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు ఇన్చార్జులు కలిసి ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వారి కుటుంబాలకు ఓదార్చేందుకు కుటుంబానికి సహారా చేయడానికి ,ధైర్యం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.గత వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం లో గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగితే 3 గంటల్లోపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాటి ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చారని తెలిపారు. మృతి చెందిన వారికి ₹1 కోటి రూపాయలు చెక్ రూపం లో తర్వాత రోజు ఇచ్చరని ఆయన గుర్తు చేశారు. కార్మికుల రక్తం చెమటగా మారితేనే రూపాయి అవుతుందని ఇది చంద్రబాబు ఆయన కుమారుడు తెలుసుకోవాలని చెప్పారు. కార్మిక నాయకుల కు పట్టుకొని గొడవలు చేయడానికి వచ్చారా అని లోకేష్ సంస్కారహీనంగా మాట్లాడారని వ్యక్తం చేశారు. కార్మికుల నాయకులకు మీరు మాట్లాడిన అవసరం లేదని మీ ఇంటి వారు చనిపోయారా అని చెప్పడం దారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నవారు అదే ఫ్యాక్టరీలో ఇంత ప్రమాదం జరిగితే ఆ నినాదాలు గుర్తుకు రాలేదా ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!