–92 గ్రాముల బంగారు..20 గ్రాముల వెండి స్వాధీనం ..
సలాం ప్రొద్దుటూరు :
పట్టణంలోని శంకరయ్య వీధి చెందిన గగనపల్లి శివాజీ రావు ఇంట్లో ఫిబ్రవరి 7న జరిగిన దొంగతనం సంబంధించి కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్, నాట్ గ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించి దొంగ ఆచూకీ తెలుసుకొని సోమవారం మధ్యాహ్నం వన్ టౌన్ పోలీసులు దొంగను అరెస్ట్ చేశారని ఎ ఎస్ పి విభూ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఎ ఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఎ ఎస్పి విభూ కృష్ణ కేసు వివరాలు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ముద్దాయి శివ మునియప్పన్ ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ నుంచి ప్రొద్దుటూరు ఉదయం సుమారు తొమ్మిది గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారం అంగళ్లు , బజార్లో తిరుగుతూ ప్రతి ఇంట్లో వెళ్లేవాడన్నారు. ఇంట్లో ఎవరైనా కనబడితే వారికి తన వద్ద ఉన్న డాక్టర్ సర్టిఫైడ్ చేసిన చీటీ చూపించి తనకు చెవుడు , మూగా , బంధువులు , తల్లిదండ్రులు ఎవరూ లేరని ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరే వాడు అని అన్నారు. కొంతమంది ఇచ్చే ఆర్థిక సాయం తీసుకుని ఎవరూ లేని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ,మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, వెండి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు దొంగలించేవాడన్నారు. ఈ క్రమంలోనే శంకరయ్య గారి వీధిలో నివాసం ఉండే గగనపల్లి శివాజీ రావు ఇంటికి చొరబడి అతని భార్య హాల్లో అస్వస్థ తో పడుకొని ఉండగా గమనించి నేరుగా పూజాగదిలో వెళ్లి అక్కడ ఉన్న బంగారు రుద్రాక్ష మాల, ఆంజనేయస్వామి డాలర్, ఒక బంగారు చైన్, రెండు బంగారు ఉంగరాలు మరియు రెండు వెండి ఉంగరాలు దొంగలించి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. శివాజీ రావు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ , నాట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా ముద్దాయి ఆచూకీ కనుక్కొని మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాసవి సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి అ 92 గ్రాముల బంగారం 20 గ్రాముల వెండి స్వాధీనం చేశారని తెలిపారు.
వన్ టౌన్ పోలీసులకు అభినందనలు
ఈ కేసులో నిందితుడుని గుర్తించి అరెస్ట్ చేసి సుమారు 16 లక్షల విలువగల బంగారు ,వెండి ఆభరణాలు , సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, సామ్సంగ్ ట్యాబ్ , ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్సైలు శ్రీనివాసులు ,మధుసూదన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది s.శ్రీనివాసులు,k. భాష ,y.నరసింహ నాయుడు, సాయి కిషోర్ లను జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు ఎ ఎస్పి విభూ కృష్ణ లు అభినందించారు.
