సలాం ప్రొద్దుటూరు:
అమృత్ నగర్ లో పేదలు నివసించేందుకు లో ఇచ్చిన స్థలాలను కబ్జా చేసిన వారి పై పీడి యాక్ట్ పెట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరియు రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్నవారికి 2009 లో మరియు 2018 లో కలిపి 2200 మందికిస్థలాలు మంజూరు చేశారన్నారు. అయితే అప్పటినుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు మారిన, పేదలకు ఇచ్చిన స్థలాల్లో కరెంటు ,మంచినీరు ,రోడ్లు హౌసింగ్ లోన్లు పట్టించుకోవడం లేదన్నారు .ప్రొద్దుటూరు టౌన్ లో నివాసం ఉన్న పేదలకు అమృత నగర్ లో 2200 మందికి స్థలాలు ఇచ్చారే తప్ప అక్కడ మౌలిక వసతులు కల్పించలేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులో ఉన్న అన్నిరాజకీయ పార్టీ లా నాయకులు వ్యక్తిగత సమస్యలు పక్కనపెట్టి ప్రజల సమస్యల పట్ల నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు పేదల మౌలిక వసతుల ,సమస్యలు కనబడలేదా అని ప్రశ్నించారు. వారి వారి ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప పేదలు సమస్యల గురించి ప్రస్తావించడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు. కొందరు రాజముద్ర కలిగినటువంటి దొంగ పట్టాలు తయారు చేసుకొని పేదలకు ఇచ్చిన స్థలాలు దౌర్జన్యంగా వారిని బెదిరించి వారి స్థలాల్లో వారిని నిర్మాణాలు చేసుకుని ఇవ్వకుండా అడ్డుపడుతూ ఆ స్థలాలను కబ్జా చేసి అమ్ముకుంటూ ₹కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అన్నారు. కొందరు అధికారులు సచివాలయంలో వీఆర్వోలు ఇటువంటి దొంగలకు సహకరిస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున వెంటనే వారికి విద్యుత్తు మంచినీరు రోడ్లు హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఎంపీడీవో ఆఫీసు వద్ద వచ్చే సోమవారం నుంచి కంటిన్యూగా సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన లబ్ధిదారులతో కలిసి చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు విజయకుమార్ బాబు ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాథ్ అధ్యక్షులు మేరీ బాబు ఐద్వా పట్టణ కార్యదర్శి జి ప్రేమ అధ్యక్షులు వై విజయ కుమారి రాములమ్మ భానుమతి పుష్పలత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డేవిడ్ అధ్యక్షులు శేఖర్ స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు వెంకటేష్ సుబ్బారెడ్డి పెంచల్ రెడ్డి హసీనా గోవిందమ్మ సుబ్బరాయుడు రమణ బ్రహ్మయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
