ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా యోగివేమన యూనివర్సిటీలో ఘన నివాళులు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా యోగివేమన యూనివర్సిటీలో ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు –   కడప:

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యోగివేమన యూనివర్సిటీలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌కు ఉన్న స్థానం ఎప్పటికీ చెరిగిపోదని అన్నారు.కార్యక్రమంలో కడప జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పసుపులేటి సాయి దత్త, కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయి కుమార్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి, కడప నగర ఉపాధ్యక్షులు జబ్బార్, నగర ప్రధాన కార్యదర్శి విష్ణు, యోగివేమన యూనివర్సిటీ అధ్యక్షులు హరి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు గణేష్, విద్యార్థి విభాగం నాయకులు నవీన్, దొంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. KSRM విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!