వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా యోగివేమన యూనివర్సిటీలో ఘన నివాళులు

  సలాం ప్రొద్దుటూరు –   కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యోగివేమన యూనివర్సిటీలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌కు ఉన్న స్థానం...