ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదల సేవలో ఎన్టీఆర్‌ భరోసా.. 4వ వార్డులో పెన్షన్ల పంపిణీ

పేదల సేవలో ఎన్టీఆర్‌ భరోసా.. 4వ వార్డులో పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

 

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు 4వ వార్డులో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.కామిశెట్టి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు.ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కొండారెడ్డి ఆదేశాల మేరకు వార్డులో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పేదలకు అండగా నిలవడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.“పేదలకు అండ.. ఎన్టీఆర్‌ భరోసాతో సంక్షేమ బాట” అంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!