–11వ వార్డులో పింఛన్ల పంపిణీ
సలాం ప్రొద్దుటూరు:
పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ రాష్ట్ర యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఘంటసాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదల జీవితాల్లో భరోసా నింపడమే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం లక్ష్యమని ఆయన అన్నారు.


