ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్వై ఎస్ జబివుల్లా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ

వై ఎస్ జబివుల్లా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

–లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

 

సలాం   ప్రొద్దుటూరు:

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్‌ మొత్తాన్ని అందజేశారు.పెన్షన్‌దారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జబివుల్లా పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో చేరేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు అండగా నిలిచే విషయంలో టీడీపీ నాయకులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా నిరంతరం కృషి చేస్తామని జబివుల్లా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!