ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్రిమ్స్‌ ఆసుపత్రిలో రోగులకు ఐద్వా ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

రిమ్స్‌ ఆసుపత్రిలో రోగులకు ఐద్వా ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

📰 Generate e-Paper Clip

 

–200 మంది పేద రోగులకు ఇడ్లీలు అందించిన మహిళా సంఘం నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు –   కడప:

కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ప్రొద్దుటూరు ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో సోమవారం అల్పాహారం పంపిణీ చేశారు. ఐద్వా నాయకులు ఆసుపత్రికి చేరుకుని సుమారు 200 మంది రోగులకు ఇడ్లీలు అందించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఐద్వా అధ్యక్షురాలు వై. విజయమ్మ, ఉపాధ్యక్షురాలు వై. ఝాన్సీ, నాయకురాలు వై. కళావతి మాట్లాడుతూ.. కడప రిమ్స్‌ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పేద, సామాన్య కుటుంబాలకు చెందిన రోగులు చికిత్స కోసం వస్తుంటారని తెలిపారు. వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు తమవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో అల్పాహారం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఐద్వా నాయకులు తెలిపారు. భవిష్యత్తులోనూ అవసరమైన చోట సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, మహిళా సంఘం కార్యకర్తలు పాల్గొని రోగులకు ఇడ్లీలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!