ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌ పట్నం లక్ష్మణ్ కు ఘన సన్మానం

మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌ పట్నం లక్ష్మణ్ కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇటీవల మార్కెట్ యార్డు చైర్‌పర్సన్‌గా ఉన్న వద్ది సురేఖ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో అదే బీసీ వర్గానికి చెందిన పట్నం లక్ష్మణ్‌ను ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా నియమించడంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.

 

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి, మార్కెట్ యార్డు డైరెక్టర్ సుధాకర్, యోగివేమన విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యక్షులు ఎస్. రసూల్ గౌస్ తదితరులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు రెడ్డి, భగవాన్ రెడ్డి, శేషారెడ్డి, శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొని నూతన ఇన్‌చార్జ్ ఛైర్మన్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

 

రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులు–వ్యాపారులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!