మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ ఛైర్మన్ పట్నం లక్ష్మణ్ కు ఘన సన్మానం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మార్కెట్ యార్డు చైర్‌పర్సన్‌గా ఉన్న వద్ది సురేఖ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో అదే బీసీ వర్గానికి చెందిన పట్నం లక్ష్మణ్‌ను ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా నియమించడంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా...