ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం

జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం

📰 Generate e-Paper Clip

 

 

–30 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

 

 

భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి అండర్-18, అండర్-20 స్త్రీ, పురుషుల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు.

 

 

ఈ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1000 మీటర్లు, 1500 మీటర్ల పరుగులు, హైజంప్, లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు.వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

 

 

 

ఈ పోటీల ఆధారంగా 30 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేశారు. వీరు ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వైఎస్సార్ కడప జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.క్రీడల నిర్వహణలో వ్యాయామ సంచాలకులు నాగూర్ భాష, సుబ్బయ్య, చరణ్, నాగేశ్వరరావు, ఖాదర్ రెడ్డి, ప్రభావతి, అద్భుత్ కుమార్, శివ, రఫీ, కరిముల్లా విశేషంగా సహకరించారు.ఈ సందర్భంగా భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి వై. అహమర్ భాష మరియు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పోటీల విజయవంతానికి సహకరించిన అధికారులు, నిర్వాహకులు, కోచ్‌లు, వాలంటీర్లు, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!