–డ్యామేజీ పాల ప్యాకెట్లకు రీప్లేస్మెంట్ ఇవ్వాలి
– బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్
సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు):
అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం, పాలు, గుడ్ల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కొన్ని పాల ప్యాకెట్లు చెడిపోయి గడ్డకట్టిన స్థితిలో ఉండటంతో పాటు, గుడ్ల పరిమాణం కూడా ప్రమాణాలకు తగ్గకుండా ఉందని ఆరోపించారు. ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలు పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల చెడిపోయిన పాల సరఫరాపై పత్రికల్లో కూడా వార్తలు వెలువడినప్పటికీ సమస్య కొనసాగుతోందని పేర్కొన్నారు. కొన్ని బాక్సుల్లో పాల ప్యాకెట్లు పగిలిపోయి వస్తున్నాయని, అలాంటి డ్యామేజీ పాల ప్యాకెట్లకు వెంటనే రీప్లేస్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని మాత్రమే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నాసిరకం సరఫరాకు బాధ్యులైన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిహెచ్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.
