ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రతి సోమవారం ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం

ప్రతి సోమవారం ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

–సమస్యల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి–మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

 

ముఖాముఖీ కార్యక్రమం అనంతరం రెగ్యులర్ PGRS కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని సూచించారు. ఫిర్యాదుదారులు 92475 63385, 98499 05863 ఫోన్ నంబర్ల ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. అందిన ప్రతి ఫిర్యాదును అధికారికంగా నమోదు చేసి, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

మున్సిపాలిటీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అనారోగ్యంతో కార్యాలయాలకు రాలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, శానిటేషన్ సూపర్‌వైజర్, MEPMA సెక్షన్ హెడ్తో పాటు PGRS విభాగం సిబ్బంది పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారని కమిషనర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!