ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్22వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

22వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

 

ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు టీడీపీ యువ నాయకుడు  నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించబడింది.

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, క్లస్టర్ ఇంచార్జ్ బేపారి ఆరీఫ్ అహమ్మద్, బూత్ ఇంచార్జ్ మాదూర్ మున్నా, వరపకుల ఖాదర్ బాషా, ఇనాయతుళ్లా, గౌస్‌పీర్, పీరు, రఫీక్, అలీ తదితరులు పాల్గొని వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు వారి నివాసాల వద్దే పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా, సకాలంలో అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!