ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

 

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికీ పర్యటించారు.

 

డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందుతోందా, వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు ఏమిటి అనే అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

 

ఈ కార్యక్రమంలో  టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఈ.వి. సుధాకర్ రెడ్డి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, శివాలయం మాజీ చైర్మన్ పల్లా శంకర్ నారాయణ, మడక బాలు, మడక రాజేష్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీరమాన్ సింగ్, వంకం ప్రసాద్, రబ్బా భరత్, సాంబ, వంకం నాగరాజు, శివప్రసాద్, నాగేంద్ర, మహేష్, విజయభాస్కర్ రెడ్డి, పల్లా శంకర్, వంకం సుబ్బరాయుడు, నల్లమారు శివదాసు, ఉదయగిరి చిన్న పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, వంగనూరు మురళీధర్ రెడ్డి, జనసేన నాయకులు ప్రసాద్, దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి, సుధాకర్, బూతూరు వెంకట్రామిరెడ్డి, రాజు కులాయప్ప, వెంకట రాముడు, వెంకట స్వామి తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!