ఇంటింటికీ వెళ్లి సంక్షేమం, అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికీ పర్యటించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందుతోందా, వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు ఏమిటి అనే అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా...